వరుణ్ తేజ్ తో వెంకీ కామెడీ ఎంటర్ టైనర్ ?

వరుణ్ తేజ్ తో వెంకీ కామెడీ ఎంటర్ టైనర్ ?

Published on Oct 18, 2021 10:59 PM IST

భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల హీరో వరుణ్ తేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వెంకీ కుడుముల స్క్రిప్ట్ కూడా రెడీ చేసి వరుణ్ తేజ్ కు కథను చెప్పాడని, ఇది ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని, అందుకే వరుణ్ తేజ్ కి కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మంచి క్రేజ్ ఉంటుంది. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

అయితే వెంకటేష్ కి కూడా వెంకీ కుడుముల ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో వెంకీతో ప్రాజెక్ట్ పట్ల వెంకటేష్ కూడా సానుకూలంగా ఉన్నాడని ఆ మధ్య వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది. వరుణ్ తేజ్ తో సినిమాకి వెంకీ కుడుముల ప్లాన్ చేసుకుంటున్నాడు. భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు