“బాహుబలి” షాట్ ను రీ క్రియేట్ చేసిన విఘ్నేష్ శివన్!

“బాహుబలి” షాట్ ను రీ క్రియేట్ చేసిన విఘ్నేష్ శివన్!

Published on Jun 16, 2024 10:00 PM IST

నేడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా తమ ప్రియమైన తండ్రికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. తండ్రులు సైతం తమ పిల్లల ప్రేమ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా తమ తండ్రులకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు.

మనందరికీ ఎంతో ఇష్టమైన బాహుబలి చిత్రం లోని ఐకానిక్ షాట్ ను విఘ్నేష్ శివన్ రీ క్రియేట్ చేసారు. తన పిల్లలు అయిన ఉయిర్, ఉలగ్ లను ఎత్తుకొని ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఈ పిల్లలతో లైఫ్ చాలా అద్బుతం గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. హీరోయిన్ నయనతారను కూడా ట్యాగ్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు