మూడు సినిమాలు లైన్ లో పెట్టిన అల్లరి నరేష్ డైరెక్టర్.

vijay kanakamedala

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ నాంది. ఆయన పుట్టినరోజు సంధర్భంగా నాంది చిత్ర టీజర్ విడుదల చేశారు. సీరియస్ కంటెంట్ తో సాగిన నాంది టీజర్ కి ప్రశంశలు దక్కాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల వరుస ఆఫర్స్ అందుకున్నాడని సమాచారం. ఆయన మొదటి చిత్రం నాంది విడుదల కాక ముందే ఆయన మూడు చిత్రాలకు సైన్ చేశారు.

విజయ్ కనకమేడలతో ఎస్ ఆర్ టి ఎంటరైన్మెంట్స్, ఏ కె ఎంటరైన్మెంట్స్ మరియు ఈస్ట్ కోస్ట్ పిక్చర్స్ చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చాయని సమాచారం. ఈ మూడు బ్యానర్స్ లో ఒక్కో చిత్రం ఆయన చేయనున్నాడు. ఇక ఈ చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. నాంది మూవీ న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నించేదిగా ఉంటుందని సమాచారం.

Exit mobile version