ఘనంగా దర్శకుడు విక్రమ్ కుమార్ వివాహం

vikram--(1)

‘ఇష్క్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఆ తరువాత ‘మనం’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్ ఈరోజు ఉదయం చెన్నైలో వివాహం చేసుకున్నారు. సూర్యతో కలిసి 24 సినిమా తీసే సమయంలో పరిచయమైన సౌండ్ ఇంజనీర్ శ్రీనిధి వెంకటేష్ ను ప్రేమించి పెళ్లాడారు విక్రమ్. వీరి నిశ్చితార్థం జూలై నెలలో జరిగింది.

ఈ వివాహా వేడుకకు హీరోలు నితిన్, సూర్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, అనూప్ రూబెన్స్, కోన వెంకట్ వంటి ప్రముఖులు హాజరై విక్రమ్ కుమార్ దంపతులను అభినందించారు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ తెలుగులో అక్కినేని అఖిల్ తో రెండవ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.