డిజప్పాయింట్ రెస్పాన్స్ అందుకున్న ‘భీమ్లా’ సెకండ్ సింగిల్!

Published on Oct 16, 2021 5:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా అదిరే రెస్పాన్స్ ను అందుకుంది అలాగే ప్రతిదీ కూడా ఆ అంచనాలు మ్యాచ్ చేసే విధంగానే ఉంది. అయితే నిన్న రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ అయితే ఊహించని రెస్పాన్స్ నే అందుకుంది చెప్పాలి.

మంచి హైప్ తోనే ప్లాన్ చేస్తూ వచ్చినా పైగా సాంగ్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా 24 గంటల్లో ఈ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ కూడా ఈ సాంగ్ క్రాస్ చెయ్యలేదు. ఖచ్చితంగా మంచి చార్ట్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్న సాంగ్ ఇది. మరి మెల్లగా స్లో పాయిజన్ లా ఊపందుకుంటుందేమో చూడాలి. బట్ థమన్, రామ జోగయ్య శాస్త్రి, చిత్ర గార్ల వర్క్ మాత్రం ఖచ్చితంగా ప్రతీ ఒక్కరినీ మైమరపించింది. అయినా కూడా ఈ సాంగ్ కి ఇది డిజప్పాయింట్ రెస్పాన్స్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :