శృతి హాసన్ ను భర్తీ చేయగల హీరోయిన్ దొరికింది !
Published on Sep 24, 2017 3:39 pm IST


దర్శకుడు సుందర్.సి అత్యంత భారీ బడ్జెట్ తో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం శృతి హాసన్ ను అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆమె ప్రాజెక్య్త నుండి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అనే చర్చ ఘనంగానే జరిగింది. దర్శక నిర్మాతలకు కూడా సరైన నటిని ఎంచుకోవడానికి చాలా సమయమే పట్టింది.

ఎట్టకేలకు మేకర్స్ దిశా పఠానిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ ల ‘లోఫర్’ చిత్రంతో దక్షిణాది పరిశ్రమకు పరిచయమైంది దిశా పఠాని. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిన ఆమె ఇక్కడ మరే సినిమాలు చేయలేదు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అదికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. చారిత్రిక నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్యలు పలు కీలక పాత్రలు చేయనున్నారు. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ చిత్రం కోసం సుమారు రూ. 450 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనుంది.

 
Like us on Facebook