డిస్నీ హాట్ స్టార్ రామ్ చరణ్‌కి భారీగా ముట్టజెప్పిందా?

Published on Sep 19, 2021 1:58 am IST


ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్‌తో తెలుగులో డిస్నీ హాట్ స్టార్‌ను రామ్ చరణ్ ప్రమోట్ చేయనున్నాడు. అయితే దీని కోసం రామ్ చరణ్‌కి డిస్నీ హాట్ స్టార్ భారీగానే ముట్టజెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు చెర్రీకి ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత ఏడాది తమిళంలో అడుగుపెట్టి సక్సెస్ సాధించామని, ఇప్పుడు తెలుగులో కూడా మంచి కంటెంట్‌తో ముందుకొచ్చి సక్సెస్ అవుతామని డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ అన్నారు.

సంబంధిత సమాచారం :