శైలజారెడ్డి అల్లుడుతో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ !

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇటీవల విడుదలైనా ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి 4రోజులు బాక్సాఫిస్ వద్ద హావ కొనసాగించిన ఈచిత్రం నిన్న వర్కింగ్ డే లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

ఈచిత్రం కేవలం 5రోజుల్లోనే 70శాతం పెట్టుబడిని వెనక్కి తేవడంతో సినిమా కొనుకున్న డిస్ట్రీబ్యూటర్స్ హ్యాపీ గా వున్నారు. ఇక ఈవారంతో ఈచిత్రం మంచి లాభాలను ఖాతాలో వేసుకోనుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు.

Exit mobile version