రజనీకాంత్ కుమార్తె విడాకులకు సిద్దపడిందా ?

Soundarya-Rajnikanth
సౌత్ సినిమా పరిశ్రమను ప్రస్తుతం ఓ వార్త కుదిపేస్తోంది. అంతలా కుదిపేసే వార్తా ఎవరి గురించి అనుకుంటున్నారా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం గురించి. తలైవార్ రజనీ చిన్న కుమార్తె సౌందర్య విడాకులకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలీదు కానీ సౌందర్య తన భర్త ఆర్. అశ్విన్ తో కలిసి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ధరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరి వివాహం 2010 లో జరిగింది. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. ఎటువంటి నిర్దారణ లేని ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుండటంతో రజనీ అభిమానాలు అసలేం జరిగిందో తెలుసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంత వరకూ రజనీ కుటుంబ సభ్యులెవరూ ఈ వార్తపై స్పందించలేదు. సౌందర్య తండ్రి రజనీకాంత్ తో ‘కొచ్చడయాన్’ చిత్రాన్ని తెరకెక్కించారు కూడ. ప్రస్తుతం ఆమె ‘యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా’ లో సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు.