“పంచతంత్రం” నుండి దివ్య శ్రీపాద ఫస్ట్ లుక్ విడుదల!

Published on Sep 5, 2021 6:36 pm IST

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, మత్తు వదలరా ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం పంచతంత్రం. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సెప్టెంబర్ 5 న దివ్య శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేవి పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారని దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా పంచతంత్రం తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ, “మా సినిమాలో కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపిస్తారు. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నాం. అన్నిటి కంటే దేవి పాత్ర చాలా ప్రత్యేకం. చాలా సదా సీదాగా, అమాయకంగా కనిపించే దేవి, ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే క్రమంలో ఆమె ధైర్యం కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారు” అని చెప్పారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ, “మా దేవి, దివ్య శ్రీపాద కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో కీలకమైన పాత్రలో ఆమె నటించారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 75 శాతం పూర్తయింది. ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.

సంబంధిత సమాచారం :