ఇది మా ఫ్యామిలీ దీపావళి వైబ్స్ – అల్లు అర్జున్

Published on Nov 7, 2021 10:56 pm IST

దీపాల వెలుగుల్లో దీపావళి వేడుకులను ఘనంగా జరుపుకుంది అల్లు కుటుంబం. తాజాగా అల్లు అర్జున్ ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. ‘ఫామ్ హౌస్‌ లో మా దీపావళి పార్టీ. ఈ అలంకరణకు కారణం స్నేహనే. తనే వ్యక్తిగతంగా ఇలా చేయించింది. ఇది దీపావళి వైబ్స్’ అంటూ బన్నీ వీడియో పోస్ట్ చేశాడు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అందుకే అల్లు ఇంటా ఆనంద దీపాలు వెలగాయి.

మొత్తానికి అల్లు ఫ్యామిలీలో దీపావళి పండుగ సందడి ఇంకా నెలకొంది. ఏ పండుగ అయిన అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకచోట చేరి సరదాగా గడుపుతారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. కాగా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సంబంధిత సమాచారం :