ఏపి, తెలంగాణాల్లో ‘డీజే’ 5 రోజుల వసూళ్లు !


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణాల్లో దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. సెలవు రోజుల్లో మాత్రమే గాక వీక్ డే అయిన మంగళవారం కూడా సినిమా వసూళ్లు స్టడీగానే కొనసాగాయి. దీంతో నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.47.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. వారం గడిచేలోపు ఈ లెక్క సులభంగా రూ. 50 కోట్లు తాకే అవకాశముంది.

అంతేగాక సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని హక్కులు అమ్మాల్సి ఉండగానే నిర్మాత దిల్ రాజు మంచి లాభాల్ని అందుకున్నారు. ఇలా సినిమా వేగంగా లాభాల దిశగా పయనిస్తుండటంతో దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు లాభాలపై ధీమాగా ఉన్నారు.

ఏరియాల వారిగా వసూళ్ల వివరాలు చూసుకుంటే..

ఏరియా వసూళ్లు
నైజాం 16.28 కోట్లు
సీడెడ్ 7.85 కోట్లు
నెల్లూరు 1.99 కోట్లు
గుంటూరు 4.44 కోట్లు
కృష్ణ 3.19 కోట్లు
వెస్ట్ గోదావారి 3.30 కోట్లు
ఈస్ట్ గోదావారి 4.44 కోట్లు
ఉత్తరాంధ్ర 5.72 కోట్లు
మొత్తం
47.21 కోట్లు