అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన డీజే


అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. డీజే చిత్రం బన్నీ కెరీర్ లోని అత్యధిక వసూళ్ళని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

గురువారం రాత్రి ప్రీమియర్ షోలలో ఈ చిత్రం 350000 డాలర్ల గ్రాస్ ని వసూలు చేసింది. శుక్రవారం 180000 డాలర్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డీజే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.