మూడు రోజుల్లో రూ.60 కోట్లు దాటిపోయిన ‘డీజే’ !


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.64 కోట్ల వసూళ్ళను అందుకున్న ఈ సినిమా బన్నీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నిర్మాణ సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి మూడు రోజుల్లోనే రూ.34.72 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ.41 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ షేర్ రూ. 45కోట్లుగా ఉంది. అలాగే నార్త్ అమెరికాలో కూడా వసూళ్ళు మిలియన్ డాలర్ మార్కుకు దగ్గరయాయ్యి.

ఇక ఏపి, తెలంగాణాల్లో ఏరియాల వారీగా చూసుకుంటే..

ఏరియా వసూళ్లు
నైజాం 11.57 కోట్లు
సీడెడ్ 5.50 కోట్లు
నెల్లూరు 1.59 కోట్లు
గుంటూరు 3.55 కోట్లు
కృష్ణ 2.32 కోట్లు
ఈస్ట్ గోదావారి 3.03 కోట్లు
వెస్ట్ గోదావారి 2.81 కోట్లు
ఉత్తరాంధ్ర 4.33 కోట్లు
మొత్తం
34.72 కోట్లు