ఏపి, తెలంగాణల్లో ‘డీజే’ కలెక్షనల్ పూర్తి స్థాయి వివరాలు !


‘సరైనోడు’ చిత్రంతో గతేడాది మంచి విజయాన్ని అందుకుని తన మార్కెట్ స్థాయిని అమాంతం పెంచుకున్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం కూడా ‘దువ్వాడ జగన్నాథమ్’ తో అలాంటి ప్రయత్నమే చేశారు. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీతో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఏపి. తెలంగాణాలో దాదాపు రూ.18 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ వసూళ్లే ఇప్పటి దాకా బన్నీ కెరీర్లో ఉత్తమమైనవిగా నమోదయ్యాయి.

ఇక ఏరియాల వారీగా ఈ లెక్కల్ని చూసుకుంటే..

ఏరియా వసూళ్లు
నైజాం 4.90 కోట్లు
సీడెడ్ 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర 1.94 కోట్లు
గుంటూరు 2.26 కోట్లు
కృష్ణ 1.03 కోట్లు
ఈస్ట్ గోదావారి 1.86 కోట్లు
వెస్ట్ గోదావారి 2.08 కోట్లు
నెల్లూరు 1.10 కోట్లు
మొత్తం 17. 87 కోట్లు