‘డీజే’ ఎడిటింగ్ పనులు మొదలయ్యాయ్!

dj-allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా కొద్దికాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక ప్రొడక్షన్‌తో పాటే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టి చకచకా సినిమాను పూర్తి చేసేస్తున్నారు.

ఇప్పటివరకూ పూర్తైన ఔట్‌పుట్ ఎడిటింగ్ వర్క్‌ పనుల్లో దర్శకుడు హరీష్ శంకర్ టీమ్ మునిగిపోయింది. హరీష్ శంకర్ స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నారు.