నైజాంలో భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన ‘డీజే’ !

24th, June 2017 - 10:39:06 AM


నిన్న విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ బాక్సాఫీస్ వద్ద భారీ రేంజులో ఓపెనింగ్స్ సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమేగాక ఓవర్సీస్లో సైతం మంచి వసూళ్లను బన్నీ కెరీర్లోనే అత్యుత్తమ వసూళ్లను నమోదు చేసిన సినిమాగా నిలబడింది. ముఖ్యంగా నైజాం ఏరియా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రీతిలో ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం నిన్న శుక్రవారం రూ. 4. 90 కోట్లు కొల్లగొట్టిందీ చిత్రం. ఓవర్సీస్ లెక్కల ప్రాకారం గురువారం ప్రదర్శింపబడ్డ ప్రీమియర్ల ద్వారా 3.5 లక్షల డాలర్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు 1.8 లక్షల డాలర్లను రాబట్టింది. ఇక ఈరోజు, రేపు వారాంతాలు కావడం, సోమవారం రంజాన్ పండుగ కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశముంది.