నైజాం ఏరియాలో బన్నీ దూకుడు !


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ నిన్న శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాం ఏరియాలో మొదటి రోజే రూ. 4.90 కోట్ల రూపాయల వసూళ్లను సంపాదించిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే దూకుడును కొనసాగించింది. దాదాపు అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి.

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం నిన్న శనివారం రూ. 3.42 కోట్ల రూపాయలు వసూలయాయ్యి. దీంతో చిత్రానికి రెండు రోజులకు గాను ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ.8.32 కోట్ల షేర్ దక్కింది. అలాగే ఇతర ప్రధాన ఏరియాల్లో సైతం బన్నీ ఇదే స్థాయి జోరు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఈరోజు, రేపు కూడా సెలవులే కావడం సినిమాకు మరింతగా కలిసిరానుంది.