పాటలతోనే ప్రేక్షకుల్ని ఊపేస్తున్న డీజే !


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ చిత్రంలోని రెండవ పాట ‘గుడిలో బడిలో మడిలో’ కు సంబందించిన నిమిషం నిడివి ఉన్న వీడియో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో విడుదలైంది. అలా విడుదలైన కాసేపటికే టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటోంది.

పాట లిరిక్స్, సంగీతం రెండూ వినడానికి చాలా కొత్తగా ఉండటం, బన్నీ వేసిన స్టెప్స్, అతని డ్రెస్సింగ్, లుక్స్ అన్నీ కొత్తగా ఉండటం అంతేగాక పూజ హెగ్డేతో కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అవడంతో పాటకు విశేష స్పందన లభించింది. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు ఈ పాటకు 1.4 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇలా విడుదలైన మొదటి రెండు పాటలు అనూహ్య రీతిలో ఆకట్టుకోవడంతో మిగిలిన సాంగ్స్ కూడా ఇదే స్థాయిలో ఉంటయాని, విజువల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయనే నమ్మకం ఏర్పడుతోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సాంగ్ కొరకు క్లిక్ చేయండి: