అభిమానులకు మరో ట్రీట్ ఇవ్వనున్న ‘దువ్వాడ జగన్నాథం’ !

29th, May 2017 - 12:43:54 PM


అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమాను అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘శరణం భజే భజే’ అనూహ్య స్పందనను దక్కించుకుని అంచనాల్ని మరింతగా పెంచింది.

ఇప్పుడు అదే రీతిలో రెండవ పాట ‘గుడిలో బడిలో’ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ రిలీజ్ చేయనున్నారు. ఈ పాట కూడా మొదటి పాట స్థాయిలోనే అభిమానుల్ని, శ్రోతల్ని అలరిస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.