సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ‘డీజే’ టీమ్ !


బన్నీ నటించిన తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ గత వరం విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. కానీ విడుదలైన పక్క రోజే సినిమాకు పైరసీ దెబ్బ తగిలింది. పలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లింకులతో పాటు పేస్ బుక్లో పూర్తి సినిమా దర్శనమిచ్చింది. దీంతో ఖంగుతిన్న చిత్ర నిర్మాతలు వ్యవరిహారాన్ని ఇలాగే వదిలేస్తే తీరని నష్టం తప్పదని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

పైరసీ ప్రింట్లు సర్క్యులేట్ అవుతున్న సోషల్ మీడియా సైట్ల లింకులు, పేస్ బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లోని కొన్ని అకౌంట్ల జాబితాను తయారు చేసి పోలీసులకు అందించారు. పోలీస్ శాఖ కూడా వీలైనంత త్వరగా కేసును తేల్చి పైరసీకి కారణమైన ముఖ్య వ్యక్తులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.