వెరైటీగా ప్లాన్ చేస్తున్న దువ్వాడ టీమ్ !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నరించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. టైటిల్ తోనే విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఆ తర్వాత విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తో ప్రభంజనం సృష్టించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సినిమా ఖచ్చితంగా బన్నీ గత సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో చిత్ర టీమ్ రెండింతల ఉత్సాహంతో పని చేస్తోంది. సినిమాను ఇంకాస్త ప్రభావవంతంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు వెరైటీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బన్నీ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.