దువ్వాడ జగన్నాథాన్ని పట్టిన పైరసీ భూతం !

26th, June 2017 - 05:37:28 PM


అల్లు అర్జున్ – హరీష్ శంకర్ల కలయికలో రూపొందిన ఈ చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ గత శుక్రవారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తున్న సంగతి తెల్సిందే. ఈ విజయాన్ని అందించినందుకుగాను కృతజ్ఞతగా డీజే టీమ్ ఈరోజు సాయంత్రం థ్యాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇంతలోనే సినిమాను పైరసీ భూతం పట్టి పాపులర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్, కొన్ని వెబ్ సైట్లలో సినిమా పైరేటెడ్ కాపీలు, లింక్స్ దర్శనమిచ్చాయి.

దీంతో ఖంగుతిన్న చిత్ర యూనిట్ తేరుకుని పోలీస్ కేసు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేగాక ఇంటర్నెట్లో సినిమాను అప్లోడ్ చేసినా, లింక్స్ ను షేర్ చేసినా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేసులు పెడతామని హెచ్చరించింది. ఇకపోతే ఎస్వీవి క్రియేషన్స్ బ్యానర్లో 25వ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ వ్యయం వెచ్చించి నిర్మించారు.