‘డీజే’ టీజర్ ను సిద్ధం చేస్తున్నారు !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డేలు జంటగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం నిజామాబాద్ షెడ్యూల్లో బిజీగా ఉంది. అక్కడ హీరో అల్లు అర్జున్, మరొక నటుడు మురళి శర్మలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన రాగా చిత్ర టీమ్ ప్రస్తుతం టీజర్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది.

ఇకపోతే ఈ టీజర్ ను ఫిబ్రవరి 24న ఉదయం 9 గంటలకు మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు హరీష్ శంకర్ స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని అభిమానులంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.