డీజే టిల్లు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రైమ్ షో ఫిల్మ్స్

Published on Feb 6, 2022 4:52 pm IST

సిద్ధు, నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డీజే టిల్లు. పిడివి ప్రసాద్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఫిబ్రవరి 12, 2022 కి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ప్రిన్స్ సిసిల్, ప్రగతి, నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :