“ఆహా” లో రికార్డులు బద్దలుగొడ్తున్న “డీజే టిల్లు”.!

Published on Mar 6, 2022 12:14 pm IST


రీసెంట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చి సాలిడ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ క్రేజీ ఫన్ రైడ్ ట్రైలర్ తర్వాత నుంచి మంచి బజ్ ను సెట్ చేసుకొని రిలీజ్ అయ్యింది. మరి ఇలా అవ్వడంతోనే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లో అదిరే వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది.

మరి ఫైనల్ రన్ లో మంచి లాభాలను అందించిన ఈ సినిమా రీసెంట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చి అక్కడ కూడా సత్తా చాటుతున్నట్టుగా వారు తెలియజేస్తున్నారు. ఈ సినిమా ఆహా లో రావడంతోనే కేవలం 48 గంటల్లో 100 మిలియన్ కి పైగా నిముషాలు స్ట్రీమ్ అయ్యి రికార్డు రెస్పాన్స్ అందుకున్నట్టుగా తెలియజేసారు. దీనితో చిత్ర యూనిట్ మరియు ఆహా వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :