“డీజే టిల్లు” కి ఆహా లో గ్రేట్ రెస్పాన్స్..!

Published on Mar 5, 2022 4:00 pm IST

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరియు యంగ్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “డీజే టిల్లు” ఒకటి. మొదటి రోజు నుంచే అటు ఓవర్సీస్ మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని అందుకొని భారీ లాభాలను కూడా అందించింది.

మరి ఇదిలా ఉండగా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఇక్కడ రావడంతోనే ఇందులో కూడా డీజే టిల్లు మాస్ రెస్పాన్స్ ని అందుకుని అదరగొడుతున్నాడట. దీనితో అటు బిగ్ స్క్రీన్స్ తో పాటు ఇప్పుడు ఓటిటి లో స్మాల్ స్క్రీన్ పై కూడా అదరగొడుతున్నాడని చెప్పాలి. మరి ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతం అందివ్వగా థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :