“డీజే టిల్లు” హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.!

Published on Mar 13, 2022 8:00 am IST

లేటెస్ట్ టాలీవుడ్ దగ్గర వచ్చి సాలిడ్ హిట్ అయ్యిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ సిద్ధూ జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి లు నటించిన చిత్రం “డీజే టిల్లు” ఒకటి. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ ని మంచి అట్రాక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ నేహా శెట్టి పరంగా ఆమెకు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఎదురయ్యాయి.

ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె చేసిన ఓ పోస్ట్ ఆసక్తిగా మారింది. డీజే టిల్లు లో రాధికా రోల్ ని టిల్లు నమ్మకపోయినా మీ అందరు నమ్మి పెద్ద హిట్ చేసారని, అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నానని అలాగే ఇక నుంచి ఈ జర్నీ ని ఇంతే మెమొరబుల్ గా కొనసాగించేందుకు నా వంతు కృషి చేస్తానని ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపింది. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :