సంక్రాంతి బరిలోకి వచ్చేసిన “డీజే టిల్లు”..!

Published on Jan 1, 2022 10:04 pm IST

బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ “ఆర్ఆర్ఆర్” రిలీజ్ వాయిదా పడడంతో సంక్రాంతి రేసులోకి చిన్న సినిమాలు వచ్చేస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన “డిజె టిల్లు” చిత్రం సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని జనవరి 14, 2022న విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ పోస్టర్‌లో నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే “డిజె టిల్లు” చిత్రం యూత్ ను అట్రాక్ట్ చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :