ఫిబ్రవరి 11న విడుదల కానున్న “డీజే టిల్లు”

Published on Jan 28, 2022 8:00 pm IST

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం DJ టిల్లు. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని పొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

సిద్ధు జొన్నలగడ్డ యొక్క విభిన్న పాత్ర మరియు విలక్షణమైన హైదరాబాదీ యాస ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. కథానాయికగా నటించిన నేహా శెట్టి టీజర్‌ తో పాటు పాటల్లోనూ గ్లామరస్‌గా కనిపించింది. ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, విమల్ కృష్ణతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే కూడా రాశారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు లెన్స్‌మెన్. నవీన్ నూలి, అవినాష్ కొల్లా ఎడిటింగ్ మరియు ఆర్ట్ విభాగాలను చూసుకున్నారు.

సంబంధిత సమాచారం :