యూఎస్ లో “డీజే టిల్లు” రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు.!

Published on Feb 17, 2022 9:00 am IST


ఈ ఏడాదిలో మన టాలీవుడ్ నుంచి వచ్చిన మరో సాలిడ్ హిట్ చిత్రం “డీజే టిల్లు”. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటడ్ హీరో హీరోయిన్స్ సిద్ధూ జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి లు నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టి మొదటి రోజు నుంచే లాభాలను తెచ్చి పెట్టింది.

ఇక యూఎస్ మార్కెట్ లో అయితే వండర్స్ చేస్తుందని చెప్పాలి. అక్కడ కూడా కేవలం ఒక్క రోజులోనే టార్గెట్ అందుకొని ఇప్పుడు రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇప్పటికి నాలుగు లక్షల డాలర్స్ వసూలు చేసి ఈ ఏడాదికి అక్కడ రిలీజ్ అయ్యిన మన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది.

ఇలా డీజే టిల్లు అక్కడ సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు. అలాగే ఫైనల్ గా అయితే ఈ చిత్రం 7 లక్షల డాలర్స్ దగ్గర ఆగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే ఈ చిత్రంతో సిద్ధూ కి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మంచి బ్రేక్ ఇచ్చారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :