“డీజే టిల్లు” సెన్సేషన్..నైజాంలో రికార్డు వసూళ్లతో బ్రేకీవెన్.!

Published on Feb 13, 2022 10:58 am IST

ఈ ఏడాది మంచి క్రేజీ అంచనాలతో వచ్చిన లేటెస్ట్ సినిమా “డీజే టిల్లు”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరియు టాలెంటెడ్ బ్యూటీ నేహా శెట్టి లు హీరో హీరోయిన్స్ గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ ని ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తూ నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా నిజంగానే ఊహించని రెస్పాన్స్ ని అందుకుంది.

సాలిడ్ బజ్ తో రిలీజ్ అయ్యిన ఈచిత్రం లేటెస్ట్ గా ఒక్క రోజులోనే నైజాం లో బ్రేకీవెన్ కొట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొట్ట మొదటి రోజు నైజాం లో ఈ చిత్రం ఏకంగా 1.63 కోట్ల షేర్ తో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు చేసి అనుకున్న టార్గెట్ ని బ్రేక్ చేసేసింది. దీనితో డీజే టిల్లు సెన్సేషన్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఎలాగో మంచి టాక్ వచ్చేసింది కాబట్టి ఫుల్ రన్ లో డెఫినెట్ గా గట్టి లాభాలనే అందించేలా ఉన్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :