“డీజే టిల్లు” సీక్వెల్ కూడా ఉండబోతుందట..!

Published on Feb 13, 2022 12:00 am IST

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌ “డీజే టిల్లు”. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్‌లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని జరుపుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ “డీజే టిల్లు” కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించామని, ఇవాళ మా అంచనా నిజమైంది. సినిమా విజయం సాధిస్తుందని తెలుసు. అంతకంటే పెద్ద విజయాన్ని అందించారని, ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుందని అన్నారు. చిన్న స్థాయి, పెద్ద స్థాయి అని కాకుండా ఏ స్థాయి సినిమా చేసినా మా సంస్థకున్న పేరును, గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలని మేము అనుకుంటామని అన్నారు. అయితే “డీజే టిల్లు” సీక్వెల్ సినిమానే సిద్ధు తదుపరి సినిమాగా చేస్తున్నామని అన్నారు.

సంబంధిత సమాచారం :