ఓవర్సీస్ లో “డీజే టిల్లు” గట్టి హంగామా తోనే షురూ చేసాడు.!

Published on Feb 12, 2022 2:04 pm IST


ఈ ఏడాది థియేటర్స్ లో మంచి బజ్ తో హంగామా చేసేందుకు సిద్ధమైన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “డీజే టిల్లు” ఒకటి. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ బజ్ తో యూత్ లో మంచి క్రేజ్ తో ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో అదిరే వసూళ్ల హంగామా తోనే టిల్లు తన హవా ని స్టార్ట్ చేసాడు.

జస్ట్ ప్రీమియర్స్ తోనే యూఎస్ లో ఏకంగా లక్ష డాలర్స్ ని అందుకొని సాలిడ్ రెస్పాన్స్ ని అందుకున్నాడు. ఇది రీసెంట్ టైం లో మరో హైయెస్ట్ అందులోని సిద్ధూ కెరీర్ లో కూడా అధికం అని చెప్పాలి. మరి ఆల్రెడీ సినిమా అయితే హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ఫైనల్ రన్ లో మంచి లాభాలనే తెచ్చి పెట్టే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :