యూత్ కి కిక్కిచ్చేలా “డీజే టిల్లు” క్రేజీ ట్రైలర్.!

Published on Feb 2, 2022 4:08 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీ అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో హీరోయిన్స్ సిద్ధూ జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి లు నటించిన చిత్రం “డీజే టిల్లు” కూడా ఒకటి. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి నుంచి యూత్ నే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తూ వచ్చింది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే మాత్రం ఈ సినిమా పక్కాగా యూత్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అనిపిస్తుంది.

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యూత్ కి మంచి రొమాన్స్ ఎలిమెంట్స్ కోరుకునే వారిని ఆకట్టుకునే సినిమాల నిలుస్తుంది అనిపిస్తుంది. మరి సిద్ధూ పెర్ఫామెన్స్ కానీ టిల్లు గా తన యాటిట్యూడ్ కానీ చాలా కొత్తగా సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. మరి సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి రోల్ ని ఇంకా బాగా చూపిస్తారేమో కానీ ఈ ట్రైలర్ లో మాత్రం తన గ్లామ్ షో తో నింపేశారు.

ఇంకా సిద్ధూ మరియు తనకి మధ్య సీన్స్ అయితే మరింత ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చెప్పాలి. వీటితో పాటు డైలాగ్స్ కూడా కొన్ని ఎబ్బెట్టుగానే ఉన్నా యూత్ లో క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకా రామ్ మిర్యాల సంగీతం ఈ ట్రైలర్ లో మాంచి ట్రెండీగా ఉంది. ఓవరాల్ గా అయితే టిల్లు మాస్ డీజే కి మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ కి హిట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ ఫిబ్రవరిలో వచ్చే సినిమాకి ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తారో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :