‘బాహుబలి’ తర్వాతి స్థానం జగన్నాథానిదే !


అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ యొక్క హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలున్నాయి. టీజర్, పాటలు, ట్రైలర్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన టీజర్ కు దక్కుతున్న ఆదరణ. గత 5 వ తేదీ సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటలు గడిచే సరికి 7.4 మిలియన్ల హిట్స్ పొందింది.

దీంతో ‘బాహుబలి-ది జాన్క్లూజన్’ తర్వాత ఆ స్థాయి ఆదరణ పొందిన చిత్ర ట్రైలర్ గా ఈ సినిమా నిలిచింది. గతంలో బాహుబలి ఒక్క రోజు వ్యవధిలో 20 మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ పొజిషన్లో ఉంది. ప్రస్తుతం బన్నీ, పూజ హెగ్డేలపై చివరి పాట షూటింగ్ జరుగుతుండగా చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 23 న రిలీజ్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి: