ట్రైలర్ తో దిగిపోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ !


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ కూడా ఒకటి. టైటిల్ తోనే విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఆ తర్వాత విడుదలైన టీజర్, రెండు పాటలతో ప్రభంజనం సృష్టించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను ఇంకాస్త పెంచాలి అన్నట్టు దువ్వాడ టీమ్ చిత్ర ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 7 గంటల 30 నిముషాలకు రిలీజ్ చేయనుంది.

మరి టీజర్ తోనే యూట్యూబ్ మాధ్యమంలో పలు రికార్డుల్ని సృష్టించిన ఈ చిత్రం ట్రైలర్ తో ఎంతటి హంగామా చేస్తుందో చూడాలి. బన్నీ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 23 న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.