నాకు, బన్నీకి ‘డీజే’ పూర్తిగా వైవిధ్యభరిమైన చిత్రం : హరీష్ శంకర్

harish-shankar
బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తదుపరి చిత్రం ‘డీజే – దువ్వాడ జగన్నాథం’. టైటిల్లోనే పూర్త్తి వైవిధ్యం నింపుకున్న ఈ చిత్రం తనకు, బన్నీకి కూడా వైవిధ్యమైనదేనని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఆర్య’ సినిమా నుండే బన్నీతో పనిచేయాలని అనుకున్నాను. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కమర్షియల్ గా ఉంటూనే హ్యూమరస్ గా కూడా ఉంటుంది.

సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ మధ్యలో షూటింగ్ మొదలుపెడతాం. షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉంటుంది. హాంగ్ కాంగ్ లో ఓ 10 రోజుల షెడ్యూల్ ఉంటుంది అన్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆయాంకా బోస్ పనిచేయనున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా 2017 సమ్మర్ కి విడుదల చేస్తామని కూడా హరీష్ శంకర్ తెలిపారు.