ఏపి, తెలంగాణల్లో ‘డీజే’ 2 రోజుల వసూళ్ల వివరాలు !

25th, June 2017 - 12:29:24 PM


అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా గత శుక్రవారం విడుదల మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ భారీ స్థాయి ఓపెనింగ్స్ సాధించి శనివారం కూడా అదే హవా కొనసాగించింది. మాస్ ప్రేక్షకులు, బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం మొదటి రోజీ ఏపి, తెలంగాణల్లో మొదటి రోజు దాదాపు రూ. 18 కోట్ల షేర్ ను చూసిన ఈ సినిమా రెండవ రోజు కూడా కలుపుకుని మొత్తం రూ.26.71 కోట్ల షేర్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.

ప్రధాన ఏరియాలైన నైజాం, సీడెడ్, ఉభయ గోదావరి జిల్లాలో సినిమా పూర్తి స్థాయి హావా కనబర్చడంతో కలెక్షన్ల లెక్కలు భారీ స్థాయిలో నమోదయాయ్యి. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలను చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం  8.32 కోట్లు
సీడెడ్ 4.05 కోట్లు
ఉత్తరాంధ్ర 3.13 కోట్లు
గుంటూరు 2.80 కోట్లు
కృష్ణ 1.61 కోట్లు
ఈస్ట్ గోదావారి 3.06 కోట్లు
వెస్ట్ గోదావారి 2.41 కోట్లు
నెల్లూరు 1.33 కోట్లు
మొత్తం 26.71 కోట్లు