సీడెడ్, ఉత్తరాంధ్రల్లో దుమ్మురేపిన ‘డీజే’ మొదటి రోజు వసూళ్లు !


అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం ముందు నుండి ఊహించినట్టే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. బన్నీ గత సినిమాలు వరుస విజయాలు కావడం, ఈ చిత్రానికి సంబందించిన టీజర్, పాటలు, ట్రైలర్స్ అద్భుతమైన స్పందనను సంపాదించడంతో భారీ క్రేజ్ క్రియేటై మంచి వసూళ్లు నమోదయ్యాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు ఏపి, తెలంగాణల్లో రూ.18 కోట్లు వసూలయ్యాయి.

ఇక మెగా ఫ్యామిలీకి మంచి పట్టున్న సీడెడ్, ఉత్తరాంధ్రలో కూడా ఈ మంచి అంకెలే నమోదయ్యాయి. ఉత్తరాంధ్రలో రూ.1.94 కోట్లు రాబట్టిన సినిమా సీడెడ్ ఎరియాలో రూ. 2.70 కోట్లు కలిపి మొత్తంగా రూ.4.64 కోట్లు రాబట్టింది. హరీష్ శంకర్ బన్నీని జగన్నాథమ్, డీజే అనే రెండు భిన్నమైన షేడ్స్ లో చూపిస్తూ చేసిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.