‘దువ్వాడ జగన్నాథమ్’ తాజా వసూళ్ల వివరాలు !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ చేసిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానుల నుండి పాజిటివ్ స్పందనను దక్కించుకుని మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఏపి, తెలంగాణాలో అయితే సుమారు రూ. 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందీ చిత్రం. అలాగే ప్రధాన ఏరియాల్లో సైతం మంచి దూకుడును ప్రదర్శించాడు జగన్నాథం.

ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజంగా ఏరియాలో రూ.4.9 కోట్లు రాబట్టిన ఈ సినిమా గుంటూరులో రూ.2.26 కోట్లు, కృష్ణా రూ.1.03 కోట్లు, మెగా హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉన్న ఈస్ట్ గోదావరిలో రూ.2.55 కోట్లు వసూలు చేయగా ఇందులో రూ.1.89 కోట్లు వర్త్ షేర్ గాను, రూ. 69 లక్షలు ఫిక్స్డ్ హయర్స్, మినిమమ్ గ్యారెంటీ రూపంలో ఉన్నాయి. ఇక ఈ చిత్రం వెస్ట్ గోదావరిలో రూ.2.83 కోట్లు వసూలు చేసింది. మిగిలిన ముఖ్యమైన ఏరియాలైన సీడెడ్, వైజాగ్ కలెక్షన్ల వివరాలు కూడా ఇంకొద్దిసేపట్లో మీముందుంచుతాం.