‘పవర్ పేట’ గుర్తుందా? కొత్త హీరోతో అఫీషియల్ అప్డేట్!

అప్పుడెప్పుడో కరోనా సమయంలో పలు సినిమాలు నేరుగా ఓటిటికి వస్తున్న సమయం అది. ఆ సమయంలోనే యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన చెక్ కూడా వచ్చింది. అలా తన లైనప్ లో ఉన్న పలు సినిమాలలో వినిపించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సినిమానే “పవర్ పేట”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా నుంచి నితిన్ తప్పుకోవడం తర్వాత మరో హీరోని అనుకోవడం ఫైనల్ గా ఇప్పుడు మేకర్స్ అధికారిక ప్రకటన అందించారు.

యువ హీరో సందీప్ కిషన్ ని తమ పవర్ పేట హీరోగా అనౌన్స్ చేసి తన 16 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బిగ్ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నట్టు ఖరారు చేశారు. రక్తంతో సాగే ప్రేమ చదరంగం అన్నట్టుగా డిజైన్ చేసిన పోస్టర్ కూడా మంచి స్ట్రైకింగ్ గా ఉంది. సో వీరి కలయికలో రానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version