హీరో డాక్టర్‌ రాజశేఖర్‌కి పితృవియోగం..!

Published on Nov 5, 2021 1:41 am IST

హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్‌ గోపాల్‌ చెన్పై డీసీపీగా రిటైర్‌ అయ్యారు.

అయితే ఆయనకు అయిదగురు సంతానం కాగా ఆందులో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్‌, వరదరాజన్‌ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More