బన్నీ లుక్ పూర్తిగా మారిపోతుందా ?

బన్నీ లుక్ పూర్తిగా మారిపోతుందా ?

Published on Oct 31, 2022 6:57 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. అయితే, ఈ సినిమాలో బన్నీ లుక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పుష్ప మొదటి పార్ట్ లో బన్నీ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో పక్కా మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి అలరించాడు. కానీ..పుష్ప 2 లో మాత్రం బన్నీ వెరీ స్టైలిష్ అండ్ క్లాస్ డాన్ లుక్ లో కనిపిస్తాడట.

పుష్ప రాజ్ నుంచి సిండికేట్ డాన్ గా ఎదిగాక, బన్నీ క్యారెక్టర్ అండ్ లుక్ పూర్తిగా మారిపోతుందట. మరి ఈ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు