‘డాలర్‌కి మరోవైపు’ ఆడియో లాంచ్..!

Dollar-ki-Marovaipu
శ్రీ ఓం సాయిరామ్ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యం నిర్మించిన ఫ్యామిలీ సినిమా ‘డాలర్‌కు మరోవైపు’. అమెరికా సంబంధం అనే కాన్సెప్ట్ ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటే చాలు గొప్ప అనుకునే తల్లితండ్రులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయికి అత్త మామల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది డాలర్‌కి ఒకవైపు. ఇక డాలర్‌కు మరోవైపు, అత్త మామలను భర్త నుంచి వేరు చేసే తత్వం ఉన్న అమ్మాయిలది. ఈ ‘డాలర్‌కు మరోవైపు’లో దర్శకుడు పూసల స్పృశించిన అంశమిదే!

నాజర్, కైకాల సత్యనారాయణ, యశ్వంత్, ప్రభావతి తదితర తారాగణం నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని కాంక్షించారు. ఈ సినిమాకు కమల్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ కార్యక్రమంలో సినిమాకు పనిచేసిన టీం పాల్గొని సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version