నెక్స్ట్ లెవెల్లో “దూకుడు” పదేళ్ల సంబరాలు.!

Published on Sep 24, 2021 2:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బెంచ్ మార్క్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో “దూకుడు” కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పాలి. పోకిరి తర్వాత మహేష్ ని మాస్ లో ఇంకో లెవెల్లో నిలబెట్టిన సినిమా ఇది. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచే అప్పటికి యంగ్ హీరోయిన్ గా ఉన్న సమంతకి కూడా బ్రేక్ వచ్చింది. అన్ని రకాలుగా భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం నిన్నటితో పదేళ్లు పూర్తి చేసుకోవడంతో మహేష్ అభిమానులు ఈసారి సంబరాలు వేరే లెవెల్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నారు.

మరి వాటికి ఏమాత్రం తగ్గకుండా దూకుడు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ లెవెల్ సంబరాలు జరిగాయి. సోషల్ మీడియాలో చూసినట్లయితే మళ్ళీ దూకుడు సినిమా ఓపెనింగ్ డే కి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపించక మానదు. అంతే కాకుండా ఈ స్పెషల్ షోస్ తో కూడా భారీ వసూళ్లు వచ్చినట్టే తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అయితే మహేష్ “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :