‘త్రికాల’ విజువల్స్‌కు ప్రశంసలు.. సినిమాటోగ్రఫీ విశేషాలు పంచుకున్న డీఓపీ పవన్ చెన్నా

DOP Pavan Chenna

శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ చిత్రంలోని విజువల్స్, సినిమాటోగ్రఫీ పనితీరుపై సినీ వర్గాల్లో ప్రశంసలు లభిస్తున్నాయి. సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్ చెన్నా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధిక, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్‌పీ సంస్థ మే 28న విడుదల చేసింది.

ఈ సినిమాలో దైవిక కాంతి, చీకటి శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని ఆవిష్కరించేందుకు గోల్డెన్ లైట్ బీమ్స్, డార్క్ టోన్స్ కలయికతో కూడిన ప్రత్యేక లైటింగ్ సెటప్‌ను ఉపయోగించినట్లు చిత్ర బృందం తెలిపింది. లైటింగ్, కంపోజిషన్ మరియు వీఎఫ్‌ఎక్స్ సమన్వయంతో విజువల్స్‌ను మలిచినట్లు పేర్కొంది. సినిమాటోగ్రఫీ విధానంపై స్పందించిన పవన్ చెన్నా.. దర్శకుడి విజన్‌కు అనుగుణంగా ప్రతి సన్నివేశంలోనూ కలర్ టోన్, కెమెరా మూవ్‌మెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వెల్లడించారు.

గతంలో వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలు, ఫ్యాషన్ ఫిల్మ్‌లకు పనిచేసిన పవన్ చెన్నా, ‘త్రికాల’ చిత్రం ద్వారా పూర్తిస్థాయి పౌరాణిక థ్రిల్లర్ జోనర్‌లో తన విజువల్ స్టోరీటెల్లింగ్‌తో మెప్పించారు. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version