“మ్యూజికల్ మైల్ స్టోన్” గా దోస్తీ మ్యూజిక్ వీడియో!

Published on Aug 2, 2021 2:25 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం కి సంబంధించిన దోస్తీ మ్యూజిక్ వీడియో ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియో ఇండియా ను ప్రస్తుతం షేక్ చేస్తోంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లోనే 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మొత్తం ఐదు బాషల్లో ఈ మ్యూజిక్ వీడియో 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించడం విశేషం. అయితే ఇదొక మ్యూజికల్ మైల్ స్టోన్ అంటూ కొందరు అంటున్నారు. అయితే ఐదు బాషల్లో ఐదుగురి తో పాడించడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తుండగా, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ సినిమా న అక్టోబర్ 13 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే మేకింగ్ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, అంతకంటే వేగంగా ఎక్కువ వ్యూస్ మరియు లైక్స్ ను ఈ మ్యూజికల్ వీడియో సొంతం చేసుకుంటుంది.

పాటను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :