భారీ ధరకు “డబుల్ ఇస్మార్ట్” డిజిటల్ రైట్స్!?

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిజిటల్ రైట్స్ పై సోషల్ మీడియా లో బజ్ వినిపిస్తోంది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం భారీ ధరకు కొనుగోలు చేసింది అని సమాచారం. అంతేకాక రామ్ పోతినేని కెరీర్ లోనే అత్యధిక ధరకు ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మే 15 వ తేదీన రామ్ బర్త్ డే సందర్భం గా ఈ చిత్రం కి సంబందించిన ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version