ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ పై మరో అప్డేట్ అందించారు మేకర్స్. రేపు ఉదయం 10:03 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఇస్మార్ట్ శంకర్ మూవీ సెలబ్రేషన్ వీడియో ద్వారా వెల్లడించారు.
85 సెకన్ల నిడివి తో ఉన్న టీజర్ మాస్ ఆడియెన్స్ కి ట్రీట్ కానుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ ట్రీట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది రామ్ పోతినేని ప్యూర్ మ్యాడ్ నెస్ తో ఉండనుంది అని మేకర్స్ హామీ ఇస్తున్నారు. రామ్ ను మరోసారి మాస్ మేకోవర్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner????
Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART ????
???????????????????????????????????????????????????????????? #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ
— Puri Connects (@PuriConnects) May 14, 2024